digvijay singh: మమ్మల్ని అంతమాట అంటారా?: దిగ్విజయ్‌సింగ్‌పై వీహెచ్‌పీ నేత అలోక్ కుమార్ ఫైర్

  • దిగ్విజయ్ గూఢచర్యం ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన అలోక్ కుమార్
  • సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్
  • ఇలాంటి ఆరోపణలతో వాతావరణం దెబ్బతింటుందని వ్యాఖ్య

పాకిస్థాన్ ఐఎస్ఐ తరపున భజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మండిపడ్డారు. ఆయన ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆయనను శిక్షించాల్సిందేనన్నారు. ఇలాంటి అర్థంపర్థంలేని ఆరోపణల కారణంగా దేశంలో వాతావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయనకు కొత్తకాదని, గతంలోనూ హిందూ తీవ్రవాదం పేరుతో ఆరోపణలు చేశారని అలోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

digvijay singh
Congress
VHP
alok kumar
  • Loading...

More Telugu News