USA: అమెరికాలో కాల్పుల కలకలం... నలుగురు మృతి

  • కాన్సాస్ లో దారుణం
  • బార్ లో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు
  • దుండగుడి కోసం గాలిస్తున్న పోలీసులు

అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎంత పెడధోరణి పట్టిందో తెలిపే మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది. అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాన్సాస్ నగరంలోని టెక్విలా కేసీ బార్ లో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం గాలిస్తున్నారు. దుండగుడు హ్యాండ్ గన్ తో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు సంఘటన స్థలంలో పడివున్న ఖాళీ తూటాల ఆధారంగా గుర్తించారు. ప్రస్తుతం కాన్సాస్ సిటీ పోలీసులు టెక్విలా బార్ పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు.

USA
Kansas
Shooting
Police
  • Loading...

More Telugu News