Nara Lokesh: బోటు ప్రమాదం వెనుకున్న నిజాలు బయటపెట్టినందుకు హర్షకుమార్ ను కేసులతో వేధిస్తారా?: నారా లోకేశ్ మండిపాటు

  • రాజకీయ రంగు పులుముకున్న బోటు మునక వ్యవహారం
  • ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
  • ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్

గోదావరిలో బోటు ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు బోటును వెలికితీయలేకపోయారు. గల్లంతైన వారి మృతదేహాలు కూడా మరికొన్ని లభ్యం కావాల్సి ఉంది. అంతేగాకుండా, ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. గోదావరి బోటు ప్రమాదం వెనకున్న నిజాలు వెల్లడించినందుకు దళితనాయకుడు హర్షకుమార్ ను కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. బోటు ప్రమాదం వెనకున్న రహస్యాన్ని జలసమాధి చెయ్యాలని చూసినంత మాత్రాన నిజాలు దాగవని తెలిపారు.

ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి బోటును వదిలిపెట్టాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ  చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి వైఎస్ జగన్ మునిగిపోయిన బోటును బయటికి తీయలేడా అంటూ నిలదీశారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని మండిపడ్డారు.

Nara Lokesh
Godavari
East Godavari District
Boat
Jagan
  • Loading...

More Telugu News