Nallamala: సీఎం సొంత నియోజకవర్గంలో యురేనియం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: అఖిలపక్షం
- యురేనియం తవ్వకాల పరిసర ప్రాంతాల్లో అఖిలపక్షం పర్యటన
- కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి అంటూ ఆందోళన
- సీఎం స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యలు
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల పరిసర ప్రాంతాల్లో అఖిలపక్ష బృందం పర్యటించింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో యురేనియం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అఖిలపక్షం పేర్కొంది. యురేనియం వ్యర్థాలతో పంటలు పండక రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతోందని, ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపింది.
యురేనియం తవ్వకాల పరిసర ప్రాంతాల్లో కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి కనిపిస్తోందని, వాతావరణం కలుషితం అవుతున్నా సీఎం స్పందించకపోవడం బాధాకరం అని అఖిలపక్ష నేతలు వ్యాఖ్యానించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో భూములు ఇవ్వడానికి వెనుకాడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.