Narendra Modi: జగన్ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర సమస్యలు చెప్పడానికా? తనపై కేసుల మాఫీ కోసమా?: నక్కా ఆనందబాబు

  • ఏపీకి ‘ప్రత్యేక హోదా’ సంగతి ఏమైంది?
  • ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచుతామన్నారు!
  • ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు

నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్ కలిసిన విషయం తెలిసిందే. మోదీతో భేటీ అనంతరం ఆయనతో ఏం మాట్లాడారో ఆ వివరాలను మీడియాకు చెప్పకుండానే జగన్ వెళ్లిపోయారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, రాష్ట్ర సమస్యలు చెప్పడానికి వెళ్లారో? తనపై ఉన్న కేసుల మాఫీ కోసం వెళ్లారో? అంటూ జగన్ పై విమర్శలు చేశారు.

ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. వెంకటాచలం ఎంపీడీవో సరళపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు? రౌడీయిజం చేస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అని ప్రశ్నించారు.

Narendra Modi
Telugudesam
Anand babu
BJP
  • Loading...

More Telugu News