Bandla Ganesh: తెలంగాణలో చట్టాన్ని, న్యాయాన్ని డబ్బుతో కొనలేమని స్కామ్ రాజా గుర్తించాలి: బండ్ల గణేశ్

  • బండ్ల గణేశ్, పీవీపీ మధ్య వివాదం
  • పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు
  • ట్విట్టర్ లో ఆరోపణలు చేసిన బండ్ల గణేశ్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేశ్, 'పీవీపీ' వరప్రసాద్ మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు వివాదాస్పదం కావడం తెలిసిందే. తనకు కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడని, అడిగితే స్పందన లేదని పీవీపీ కాస్తా బండ్ల గణేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తనకు పీవీపీ నుంచి ప్రాణహాని ఉందంటూ బండ్ల గణేశ్ కూడా పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాదు, వరుస ట్వీట్లతో పీవీపీపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తాజాగా మరోసారి ట్విట్టర్ లో ఘాటుగా స్పందించాడు.

తెలంగాణలో చట్టాన్ని, న్యాయాన్ని డబ్బులిచ్చి కొనలేమన్న విషయాన్ని స్కామ్ రాజా గుర్తించాలంటూ పరోక్షంగా పీవీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందని, ఈ స్కామ్ రాజాకు దొంగసంతకాలు పెట్టే టాలెంట్ కూడా ఉందని విమర్శించారు. ఆ కళకు ఎంతోమంది స్నేహితులే కాదు, సొంత అన్న కూడా బలయ్యాడని బండ్ల గణేశ్ ఆరోపించారు. ఏదేమైనా చివరికి ధర్మమే జయిస్తుందని వ్యాఖ్యానించారు.

Bandla Ganesh
PVP
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News