TSRTC: ఆర్టీసీ సమ్మెకు సీఎం కేసీఆర్‌ బాధ్యుడు : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్‌

  • కేసీఆర్‌ కుట్రలను తిప్పికొట్టాలి
  • పండుగ వేళ ప్రయాణికుల గోడు పట్టని ప్రభుత్వం
  • ఆయన కూతురు బతుకమ్మ ఆడితే సరిపోద్దా అని ఎద్దేవా

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండగ వేళ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గాలికి వదిలేసి కేసీఆర్‌ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన కూతురు కవిత బతుకమ్మ ఆడితే చాలని, ప్రజలకు పండగ అవసరం లేదని కేసీఆర్‌ భావిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్‌ పూర్తి బాధ్యుడని, ఆయన కుట్రలను తిప్పికొట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన జీవన్‌రెడ్డి కేసీఆర్‌ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడని, మాడి మసై పోవడం ఖాయమని విమర్శించారు.

TSRTC
Jeevan Reddy
KCR
  • Loading...

More Telugu News