Chiranjeevi: ఆయనే బతికుంటే 'శభాష్ రా చిరంజీవీ' అనేవారు: చిరంజీవి

  • తాడేపల్లి గూడెంలో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ
  • విగ్రహాన్ని చూస్తుంటే మనసు ఉప్పొంగుతోంది
  • ఫ్యాన్స్ కోసం మరిన్ని చిత్రాలు చేస్తానన్న చిరంజీవి

తాను తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే సమయానికే ఎస్వీ రంగారావు దూరమయ్యారని, ఇప్పుడు ఆయనే బతికి ఉండివుంటే, 'సైరా' చిత్రాన్ని చూసి 'శభాష్ రా చిరంజీవి' అని అనుండేవారని చిరంజీవి వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి గూడెంలో దివంగత నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మెగాస్టార్ మాట్లాడారు. పైన ఎక్కడున్నా ఆ మహానటుడు తమ ప్రయత్నాన్ని దీవిస్తారనే నమ్ముతున్నానని అన్నారు.

ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తనను గంటా శ్రీనివాస్, ఈలి నాని తదితరులు గతంలోనే కోరారని, అయితే, అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని అన్నారు. తన ఫ్యాన్స్ చూపే అభిమానమే తనను ఇంతవాడిని చేసిందని వ్యాఖ్యానించిన చిరంజీవి, భవిష్యత్తులో అభిమానులు మెచ్చే మరిన్ని చిత్రాలను చేయడమే లక్ష్యమన్నారు. తొమ్మిది అడుగులా 3 అంగుళాల ఎత్తున్న ఈ విగ్రహాన్ని చూస్తుంటే తన మనసు ఉప్పొంగుతోందని చెప్పారు.

Chiranjeevi
SVR
Statue
Tadepalli gudem
  • Loading...

More Telugu News