lottery ticket: అదృష్టమంటే ఇదే కదా.. లాటరీలో రూ.23 కోట్లు గెలుచుకున్న కర్ణాటక యువకుడు

  • 24 ఏళ్ల ఫయాజ్‌ను వరించిన అదృష్టం
  • ఆన్‌లైన్ బిగ్ టికెట్ రాఫెల్‌ డ్రాలో రూ.23.18 కోట్ల జాక్‌పాట్
  • ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫయాజ్

అదృష్టమంటే ఇలాగే ఉంటుందేమో. 24 ఏళ్ల కర్ణాటక యువకుడిని ఏకంగా రూ.23.18 కోట్ల (12 మిలియన్ దిర్హమ్‌లు) లాటరీ వరించింది. దక్షిణ కన్నడ జిల్లా అయిన సుళ్య ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్ ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆన్‌లైన్ బిగ్ టికెట్ రాఫెల్‌ లాటరీకి చెందిన టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు.

తాజాగా, నిర్వహించిన ఈ డ్రాలో ఏకంగా 23 కోట్ల రూపాయలు తగలడంతో ఫయాజ్ నమ్మలేకపోతున్నాడు. తన అదృష్టానికి ఎగిరి గంతేస్తున్నాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఫయాజ్ ముంబైలో అన్న, అక్క, చెల్లెలితో కలిసి ఉంటున్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News