varupula subbarao: టీడీపీ చేస్తున్న ప్రచారం తప్పు.. వైసీపీలోనే కొనసాగుతా: ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల

  • వరుపుల పార్టీ మారబోతున్నారని వార్తలు
  • ఖండించిన సుబ్బారావు
  • తనకు గుర్తింపునిచ్చింది వైఎస్సారేనని స్పష్టీకరణ

గత ఎన్నికల్లో టీడీపీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తెలిపారు. వైసీపీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు రాజకీయంగా గుర్తింపును ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేశారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రస్తక్తే లేదని స్పష్టం చేశారు.

ఇటీవల లింగపర్తిలో జరిగిన సమావేశంలో వరుపుల మాట్లాడుతూ.. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. ఈ వార్తపై తాజాగా ఆయన స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా సత్యదూరమని, తాను వైసీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.

varupula subbarao
prattipadu
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News