Telangana: తెలంగాణ గవర్నర్ ను కలిసిన హీరో చిరంజీవి

  • మర్యాదపూర్వకంగా గవర్నర్ తో భేటీ
  • తమిళిసైకు దసరా శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి
  • ‘సైరా’ చిత్రాన్ని చూడాలని కోరిన మెగాస్టార్

తెలంగాణ గవర్నర్ తమిళిసైను ప్రముఖ హీరో చిరంజీవి కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఈరోజు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండగను పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తాను నటించిన ‘సైరా’ చిత్రాన్ని చూడాలని ఆమెను కోరారు. అందుకు, ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తమిళిసైకి చిరంజీవి వివరించారు.

Telangana
Govenor
hero
Chiranjeevi
Tamili sye
  • Loading...

More Telugu News