Hardik Pandya: హార్దిక్ పాండ్యా సర్జరీ సక్సెస్

  • ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డ పాండ్యా
  • వెన్ను నొప్పితో బాధ పడుతున్న ఆల్ రౌండర్
  • లండన్ లో శస్త్ర చికిత్స సక్సెస్

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది. గత ఏడాది జరిగిన ఆసియాకప్ సందర్భంగా పాండ్యా గాయపడ్డాడు. అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికా సిరీస్ కు కూడా పాండ్యాను సెలెక్టర్లు దూరం పెట్టారు. దీంతో, లండన్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్ అయిందని ట్విట్టర్ ద్వారా పాండ్యా తెలిపాడు. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగుతానని చెప్పాడు. పాండ్యా ట్వీట్ కు బీసీసీఐ రిప్లై ఇచ్చింది. విషింగ్ యూ ఏ స్పీడీ రికవరీ అని ట్వీట్ చేసింది.

Hardik Pandya
Surgery
Team India
  • Error fetching data: Network response was not ok

More Telugu News