Nara Lokesh: మహిళా అధికారిణిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేశారు: నారా లోకేశ్

  • ఎంపీడీవో సరళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
  • ఈ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కూడా కరువైంది
  • సామాన్య మహిళల పరిస్థితిని తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోంది

వైసీపీ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కూడా కరువైందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జగన్ కు అంత కక్ష దేనికో అర్థం కావడం లేదని అన్నారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలను తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని... ఇప్పుడు మహిళా అధికారిణిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేశారని మండిపడ్డారు.

అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపీడీవో సరళపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితిని తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోందని చెప్పారు.

Nara Lokesh
MPDO
Sarala
Kotamreddy
Telugudesam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News