Nara Lokesh: నారా లోకేశ్ కి ధన్యవాదాలు తెలిపిన దర్శకుడు సురేందర్ రెడ్డి!

  • 'సైరా' చిత్రంపై లోకేశ్ ప్రశంసలు
  • అభినందనలను తెలుపుతూ ట్వీట్
  • 'థ్యాంక్యూ సర్' అంటూ స్పందించిన దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి, రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. 'ఎంతో పరిశ్రమించి, చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, దర్శకులు సురేందర్ రెడ్డి, సాంకేతిక సిబ్బంది, యూనిట్ మొత్తానికి హర్థికాభినందనలు' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

లోకేశ్ ట్వీట్ పై సురేందర్ రెడ్డి స్పందించారు. 'థాంక్యూ సోమచ్ సర్' అని రిప్లై ఇచ్చారు. మరోవైపు, బాక్సాఫీస్ వద్ద 'సైరా' సందడి చేస్తోంది. శని, ఆదివారాలతో పాటు దసరా సెలవులు కూడా కావడంతో... థియేటర్లు నిండిపోతున్నాయి.

Nara Lokesh
Telugudesam
Chiranjeevi
Ramcharan
Surender Reddy
Director
Sye Raa Narasimha Reddy
Tollywood
  • Loading...

More Telugu News