India: మరో రెండు తీసిన అశ్విన్... భారత తొలి ఇన్నింగ్స్ లీడ్ 71 పరుగులు!

  • 431 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్
  • ఏడు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్
  • 46 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు 71 పరుగుల ఇన్నింగ్స్ లీడ్ ను సాధించింది. శుక్రవారం నాటికే ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న స్పిన్నర్ ఆశ్విన్, ఈ ఉదయం మరో రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు 431 పరుగులకు ఆలౌటైంది. చివరి రెండు వికెట్లూ 46 పరుగుల వ్యవధిలో పడ్డాయి. నైట్ వాచ్ మెన్ కేశవ్ మహరాజ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో డబుల్ సెంచరీ వీరుడు మయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇవ్వగా, రబడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మరికాసేపట్లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

India
South Afrika
Cricket
Vizag
  • Loading...

More Telugu News