Nellore District: ఎంపీడీవో ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి... స్టేషన్ ముందు మహిళా ఎంపీడీవో బైఠాయింపు

  • ఇంటికి వచ్చి భయాందోళనలకు గురి చేసిన వైనం
  • నీటి పైపు లైను కట్.. విద్యుత్ సరఫరా నిలిపివేత
  • పీఎస్ ముందు బైఠాయించిన సరళ

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని  నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో సరళ ఆరోపించారు. కల్లూరిపల్లిలో ఉన్న తన ఇంటికి వచ్చి భయాందోళనలకు గురి చేశారని ఆమె తెలిపారు. నీటి పైపు లైనును ధ్వంసం చేశారని, కేబుల్ వైర్ ను కట్ చేశారని, ఇంటికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారని అన్నారు.

ఆయనకు సంబంధించిన లేఔట్ కు అనుమతులు ఇవ్వనందుకే దాడికి పాల్పడ్డారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే, స్టేషన్ లో కేవలం ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉండటంతో... స్టేషన్ ముందు ఆమె బైఠాయించారు. సీఐ లేదా ఎస్సై వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటానని ఆమె తెలిపారు.

Nellore District
Venkatachalam
MPDO
Sarala
Kotamreddy
Attack
YSRCP
  • Loading...

More Telugu News