Bandla Ganesh: పీవీపీ నన్ను చంపేస్తాడు: పోలీసులను ఆశ్రయించిన బండ్ల గణేశ్!

  • బండ్ల గణేశ్ పై పీవీపీ కేసు
  • పీవీపీ అనుచరులు బెదిరిస్తున్నారు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బండ్ల

పొట్లూరి వరప్రసాద్ తనను హత్య చేస్తాడని, తనకు రక్షణ కల్పించాలని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. నిన్న రాత్రి తన ఇంటిపై గణేశ్ దాడి చేశారని ఆరోపిస్తూ, పీవీపీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన బండ్ల గణేశ్, పీవీపీ తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రక్షణ కోసం తాను పోలీసులను ఆశ్రయించానని, ఉదయం నుంచి పీవీపీ అనుచరులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని అన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పీవీపీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరానని అన్నారు.

Bandla Ganesh
pvp
Polive
Hyderabad
Jubileehills
  • Loading...

More Telugu News