TSRTC: తెలంగాణలో ప్రైవేటు బస్సులను అడ్డుకుంటున్న కార్మిక సంఘాలు.. ఎక్కడికక్కడ అరెస్టులు

  • అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమలు
  • ఆర్టీసీ బస్టాండ్లలోకి ప్రైవేటు బస్సులకు అనుమతి
  • బస్సులు రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటున్న కార్మికులు

తెలంగాణ వ్యాప్తంగా గత రాత్రి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పండుగలకు ఊళ్లు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీలో ఇప్పటికే ఉన్న 2100 అద్దె బస్సులతోపాటు, దసరా సెలవులు కావడంతో విద్యాసంస్థల బస్సులను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అలాగే, బస్సులు నడిపేందుకు ముందుకొచ్చే ప్రైవేటు క్యారియర్లకు రోజువారీ పర్మిట్లు జారీ చేస్తోంది.

మరోవైపు, బస్సులు రోడ్డుపైకి రాకపోవడంతో ప్రైవేటు క్యారియర్లను నేరుగా ఆర్టీసీ బస్టాండ్లలోకి అనుమతిస్తున్నారు. అయితే, ఈ ఉదయం నుంచి డిపోల వద్ద ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నేతలు ప్రైవేటు బస్సులు రోడ్డుపైకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల భద్రత నడుమ కొన్ని చోట్ల ప్రైవేటు బస్సులు రోడ్డుపైకి వస్తున్నాయి.

  • Loading...

More Telugu News