TSRTC: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రంగంలోకి హైదరాబాద్ మెట్రో

  • గత అర్ధరాత్రి  నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె
  • ప్రయాణ వేళలను సవరించిన మెట్రో యాజమాన్యం
  • ప్రతీ మూడున్నర నిమిషాలకో రైలు

టీఎస్ ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో నగర ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగ వేళ ఊళ్లకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకుని మెట్రో వేళలను సవరించారు. నేటి నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

TSRTC
Telangana
Hyderabad
Metro rail
  • Loading...

More Telugu News