Telangana: టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీ ఎస్సార్టీసీ ఈయూ నేతల మద్దతు

  • కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
  • వీరికి మద్దతుగా నిలుస్తాం
  • అవసరమైతే ఏపీలోనూ ఆందోళనకు దిగుతాం: ఈయూ నేతలు

టీఎస్సార్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన నిమిత్తం ఐఏఎస్ ల త్రిసభ్య కమిటీతో ఈరోజు జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు అర్థరాత్రి నుంచి టీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు ఏపీఎస్సార్టీసీ ఈయూ నేతలు తమ మద్దతు ప్రకటించారు.

టీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, వీరికి మద్దతుగా అవసరమైతే ఏపీలో కూడా ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని ఈయూ నేతలు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం కేసీఆర్ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. టీఎస్సార్టీసీ కార్మికులతో చర్చలు జరిపిన ఐఏఎస్ ల త్రిసభ్య కమిటీ మరికాసేపట్లో కేసీఆర్ ను కలవనున్నట్టు సమాచారం.

Telangana
Tsrtc
Andhra Pradesh
Apsrtc
  • Loading...

More Telugu News