Parvez Musharraf: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ముషారఫ్ సన్నాహాలు!
- రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముషారఫ్
- అనారోగ్యానికి చికిత్స
- కోలుకున్నాడని తెలిపిన ఏపీఎంల్ పార్టీ కార్యదర్శి
పాకిస్థాన్ రాజకీయాల్లో పర్వేజ్ ముషారఫ్ ది ప్రత్యేకస్థానం. సైనిక పాలకుడిగా రంగప్రవేశం చేసి, ఆపై ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) అనే రాజకీయ పార్టీ స్థాపించి తనదైన ముద్రవేశారు. అయితే కొన్నాళ్లుగా ముషారఫ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 76 ఏళ్ల ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు.
అమిలోయిడిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్ చికిత్స అనంతరం కోలుకున్నారని ఏపీఎంల్ కార్యదర్శి మెహ్రీన్ మాలిక్ వివరించారు. మున్ముందు వైద్యుల సూచనల మేరకు రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలోనే ముషారఫ్ నుంచి స్పష్టమైన రాజకీయ ప్రకటన ఉంటుందని మాలిక్ వెల్లడించారు. అక్టోబరు 6న ఏపీఎంల్ 9వ వార్షికోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన రాజకీయ పునఃప్రవేశం ఉంటుందని తెలుస్తోంది.