train jurney: రైలు ప్రయాణంలో ఉండగా పురిటి నొప్పులు...108 అంబులెన్స్ లో ప్రసవం

  • వాహనంలోనే కవలలకు జన్మనిచ్చిన మహిళ
  • దిబ్రూఘడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వెళ్తుండగా ఘటన
  • అధికారుల సమాచారంతో రాజమహేంద్రవరంలో వాహనం సిద్ధం

చెన్నై ఎగ్మోర్‌ నుంచి దిబ్రూఘడ్‌కు రైలు ప్రయాణం చేస్తున్న నిండు గర్భిణి పండంటి కవలలకు జన్మనిచ్చింది. రైలులోనే పురిటినొప్పులు ప్రారంభం కావడంతో అధికారులు సమీపంలోని రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు సమాచారం అందించారు. వారు రైలు చేరేసరికి 108 వాహనాన్ని సిద్ధం చేసి ఉంచారు. రైలు రాగానే బాధితురాలిని అందులో  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగి, ఆమె కవలలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలను 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

train jurney
pregnent
pains in train
delivery in 108
  • Loading...

More Telugu News