Chandrababu: బాలకృష్ణను దండించి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?: చంద్రబాబు వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందన

  • సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు బాధపడుతున్నారు
  • మోదీ గురించి బాలకృష్ణ పిచ్చికూతలు కూశారు
  • తాను తీసుకున్న గోతిలోనే పడ్డట్టుంది మీ పరిస్థితి

సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై పెడుతున్న పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి వెధవ మాటలు వినడానికా రాజకీయాల్లోకి వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు బాధపడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు హాజరైన ధర్మపోరాట దీక్ష వేదికపై దేశ ప్రధాని మోదీ గురించి మీ బావ బాలకృష్ణ పిచ్చికూతలు కూశారు. బాలకృష్ణను మీరు దండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? తాను తీసుకున్న గోతిలోనే పడ్డట్టుంది మీ పరిస్థితి. ఇప్పటికైనా కళ్లు తెరవండి' అంటూ ట్వీట్ చేశారు.

Chandrababu
Balakrishna
Telugudesam
Vishnu Vardhan Reddy
BJP
Narendra Modi
Social Media
  • Loading...

More Telugu News