వంట నూనె కంపెనీకి సినీ నటి అంజలి ప్రచారం.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు
- ఈరోడ్ కేంద్రంగా వంట నూనె తయారీ
- నిబంధనలు పాటించకుండా తయారు చేస్తున్నారని ఫిర్యాదు
- వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నటిపై ఆరోపణ
ఈ మేరకు గురువారం ఆయన కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా తయారుచేస్తున్న నూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని, తయారీదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆ నూనె వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నటి అంజలిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.