Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సంబరపడిపోతున్న తమన్నా 
  • దుబాయ్ కి మహేశ్ ఫ్యామిలీ 
  • పెళ్లికూతురవుతున్న అర్చన 

*  'సైరా' చిత్రం తనకి ఆర్టిస్టుగా మంచి పేరు తెస్తున్నందుకు అందాల నాయిక తమన్నా తెగ సంబరపడిపోతోంది. 'ఇన్నాళ్లు నన్ను ఆయా సినిమాలలోని పాత్రలను బట్టి అవంతిక, నీహారిక అంటూ పిలిచేవారు. ఇప్పుడు లక్ష్మీ నరసింహా రెడ్డి అంటూ పిలుస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా వుంది. ఇది నా కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
 *  హీరో మహేశ్ బాబుకి దుబాయ్ అంటే బాగా ఇష్టం. అందుకే ఎప్పుడు సమయం దొరికినా ఫ్యామిలీతో కలసి అక్కడికి వెకేషన్ కి వెళుతుంటాడు. ఇప్పుడు కూడా షూటింగ్ నుంచి దసరా వెకేషన్ తీసుకుని కుటుంబ సభ్యులతో కలసి దుబాయ్ వెళ్లాడు. ఐదారు రోజులు అక్కడ గడుపుతాడట.
*  పలు చిత్రాలలో నటించిన కథానాయిక అర్చన పెళ్లికూతురు అవుతోంది. ఓ ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీశ్ ని ఆమె వివాహం చేసుకుంటోంది. వీరి వివాహ నిశ్చితార్థ వేడుక తాజాగా హైదరాబాదులోని ఓ హోటల్ లో జరిగింది.

Tamannaah
Saira
Mahesh Babu
Archana
  • Loading...

More Telugu News