Andhra Pradesh: ప్రత్యేక హోదా పేరుతో మోసగించడం ఇకనైనా ఆపాలి: కన్నా వ్యాఖ్యలు

  • ఏపీ అధికార, విపక్షాలకు కన్నా హితవు
  • ఏపీలో బీజేపీ బలపడుతోందని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రం సాయం చేస్తుందని వెల్లడి

ఏపీలో బీజేపీ నానాటికీ బలపడుతోందని, ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోనే చేరుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇతర పార్టీల నేతలకు బీజేపీనే కనిపిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలను మోసగించడం ఇకనైనా ఆపాలని ఏపీ అధికార, విపక్షాలకు హితవు పలికారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అన్ని ప్రయోజనాలను కేంద్రం కల్పిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రం నుంచి సహాయం ఆగదని అన్నారు.

Andhra Pradesh
Kanna
BJP
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News