Hindi: హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదు: వెంకయ్యనాయుడు

  • హిందీ నేర్చుకోవాలంటూ అమిత్ షా వ్యాఖ్యలు
  • దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర విమర్శలు
  • స్పందించిన ఉపరాష్ట్రపతి

ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హిందీ నేర్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు అనేక రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలను రగిల్చాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ఆమోదయోగ్యం కాదంటూ అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అన్ని భాషలకు సరైన గౌరవం కల్పించాలని అన్నారు. హిందీ ప్రచారంలో తెలుగు సాహిత్యం పాత్ర కీలకం అని అభిప్రాయపడ్డారు. జాతీయ భాష ప్రచారానికి హైదరాబాద్ ముఖద్వారం వంటిదని పేర్కొన్నారు.

Hindi
Venkaiah Naidu
Andhra Pradesh
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News