Rakesh: ఆకట్టుకుంటోన్న 'ఎవ్వరికీ చెప్పొద్దు' ట్రైలర్
- మరో ప్రేమకథగా 'ఎవ్వరికీ చెప్పొద్దు'
- ప్రేమతో పాటు కామెడీకి చోటు
- హీరోయిన్ గా గార్గేయ పరిచయం
తెలుగు తెరను పలకరించే చిత్రాలలో ప్రేమకథాంశాలే ఎక్కువ. ప్రేమ అనే కథాంశం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది కనుక, ఆ కంటెంట్ తో యూత్ ను మెప్పించడానికి యువ దర్శకులు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అలా బసవ శంకర్ దర్శకత్వంలో 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమా రూపొందుతోంది. రాకేశ్ .. గార్గేయి ఈ సినిమాలో నాయకా నాయికలుగా కనిపించనున్నారు.
హీరోగా చేస్తోన్న రాకేశ్ ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేమ - కులం అనే అంశాల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఎవరికి వారు తమకి తెలిసిన సీక్రెట్ ను మరొకరితో చెప్పి, 'ఎవ్వరికీ చెప్పొద్దు' అంటూ వుంటారు. ఆ డైలాగ్ పైన .. 'మీ క్యాస్ట్ ఏంటి? అనే డైలాగ్ పైన ఈ ట్రైలర్ ను కట్ చేశారు.