Manmohan Singh: గరునానక్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పాక్ గడ్డపై అడుగు పెట్టనున్న మన్మోహన్

  • ఈ ఏడాది గురునానక్ 550వ జయంతి
  • కర్తార్ పూర్ కు మన్మోహన్ ను ఆహ్వానించిన అమరీందర్ సింగ్
  • కోవింద్, మోదీలను కూడా ఆహ్వానించామన్న పంజాబ్ సీఎం

గురునానక్ జయంతి సందర్భంగా పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీలకు కూడా పంజాబ్ రాష్ట్రం తరపున ఆహ్వానించామని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. అయితే తాము కర్తార్ పూర్ గురుద్వారా సందర్శనకు మాత్రమే వెళ్తున్నామని... కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి వెళ్లడం లేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ కూడా తన పర్యటనను ఇంత వరకే పరిమితం చేసుకుంటారని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది గురునానక్ 550వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

Manmohan Singh
Gurunanak
Kartarpur
Amarinder Singh
Punjab
  • Loading...

More Telugu News