Chandrababu: గాంధీ జయంతి రోజున మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలి: ఎమ్మెల్యే రజని డిమాండ్

  • జగన్ వైఖరి అర్థంకావడంలేదన్న చంద్రబాబు
  • గాంధీ జయంతి రోజున మద్యం అమ్మడమేంటని వ్యాఖ్యలు
  • చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

సీఎం జగన్ వైఖరిని విశ్లేషించడం ఎవరి వల్ల కావడంలేదని, గాంధీ జయంతి రోజున కూడా మద్యం అమ్మడం ఏంటో అర్థంకావడంలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని స్పందించారు. గాంధీ జయంతి రోజు మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మద్యనిషేధం దిశగా కృషి చేస్తోందని రజని స్పష్టం చేశారు.

Chandrababu
Jagan
Vidadala Rajini
Andhra Pradesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News