Gangula Kamalakar: తెలంగాణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన గంగుల కమలాకర్

  • పౌరసరఫరాలు, వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన గంగుల
  • కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయను 
  • ఒక్క బియ్యపు గింజ కూడా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి 

తెలంగాణ పౌరసరఫరాలు, వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖల మంత్రిగా గంగుల కమలాకర్ నేడు పదవీబాధ్యతలను స్వీకరించారు. బీసీ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, బలహీనవర్గాలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

 తనపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. వెనుకబడిన వర్గాల ఉన్నతికి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు గత ఐదేళ్ల కాలంలో టెక్నాలజీ సాయంతో అడ్డుకట్ట వేయడం జరిగిందని చెప్పారు. ఒక్క బియ్యం గింజ కూడా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Gangula Kamalakar
Telangana
KCR
TRS
  • Loading...

More Telugu News