India: డబుల్ సెంచరీకి చేరువలో రోహిత్ ఔట్.. మయాంక్ సెంచరీ

  • 176 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన రోహిత్
  • 138 పరుగులతో ఆడుతున్న మయాంక్ అగర్వాల్
  • దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్

విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే భారీ స్కోరు నమోదు చేశాడు. దూకుడుగా ఆడుతూ, డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్న తరుణంలో... 176 పరుగుల వద్ద మహారాజ్ బౌలింగ్ లో స్టంపౌట్ అయి పెవిలియన్ చేరాడు. దీంతో, రోహిత్ డబుల్ సెంచరీ కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు నిరుత్సాహానికి లోనయ్యారు.

ఇక మరో ఎండ్ లో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని... 138 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఓపెనర్లు ఇద్దరూ కలసి 317 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మయాంక్ కు పుజారా (6 పరుగులు) జతకలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 324 పరుగులు.

India
South Africa
First Test
Vizag
Rohit Sharma
Mayank Agarwal
  • Error fetching data: Network response was not ok

More Telugu News