thota nagesh: టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో విశాఖ జిల్లా సీనియర్ నేత తోట నగేశ్

  • ఇటీవల కన్నా, మధుకర్‌జీలతో చర్చలు
  • వైసీపీ నుంచి రాని హామీ
  • నేడు బీజేపీలో చేరిక?

ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. విశాఖపట్టణం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేశ్ పార్టీకి బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు తోట దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తోట నగేశ్.. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి మద్దతుదారులను కూడగడుతున్నారు.

ఈ క్రమంలో వైసీపీ, బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీలు విడివిడిగా నగేశ్ ఇంటికొచ్చి చర్చలు జరిపారు. వైసీపీ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో చివరికి బీజేపీలో చేరాలని నగేశ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే తోట నగేశ్ నేడు బీజేపీలో చేరడం పక్కాగా కనిపిస్తోంది.

thota nagesh
Visakhapatnam District
Telugudesam
BJP
  • Loading...

More Telugu News