Rohit Sharma: ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్‌శర్మ

  • 174 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్
  • మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా సెంచరీ చేసిన రోహిత్
  • విశాఖ టెస్టులో ఘనత

దక్షిణాఫ్రికాతో విశాఖపట్టణంలో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా దిగి సెంచరీ బాదిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయనగరంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో డకౌట్ అయి విమర్శల పాలైన రోహిత్.. అసలు మ్యాచ్‌లో అదరగొట్టాడు.

సంయమనంతో ఆడుతూ అడపాదడపా బంతులను బౌండరీలకు తరలిస్తూ, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 174 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 12 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా సెంచరీ సాధించిన మొట్టమొదటి భారత ఆటగాడిగా రోహిత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.

Rohit Sharma
team India
test match
Visakhapatnam
  • Loading...

More Telugu News