Jagan: మున్సిపల్ కమిషనర్ జగన్.. నవ్వులపాలవుతోన్న వైసీపీ ఫ్లెక్సీ

  • పార్వతీపురంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వైసీపీ శ్రేణులు
  • మున్సిపల్ కమిషనర్ స్థానంలో జగన్ ఫొటో
  • ప్రత్యేక అధికారి స్థానంలో ఎమ్మెల్యే జోగారావు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నవ్వులపాలవుతోంది. వార్డు సచివాలయం ఏర్పాటు సందర్భంగా ఓ ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి జగన్ ను మున్సిపల్ కమిషనర్ గా మార్చేశారు. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ స్థానంలో జగన్ ఫొటోను పెట్టారు. అంతేకాదు ప్రత్యేక అధికారి స్థానంలో ఎమ్మెల్యే జోగారావు చిత్రాన్ని ఉంచారు.

వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని చూసి స్థానికులు నవ్వుకున్నారు. తప్పిదాన్ని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే ఫ్లెక్సీని తొలగించారు. ఈ లోగానే జరగాల్సిన తప్పిదం జరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Jagan
Parvathipuram
Flex
YSRCP
  • Loading...

More Telugu News