KCR: రేపు ఢిల్లీకి కేసీఆర్‌, ఎల్లుండి ఉదయం మోదీతో భేటీ

  • ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు మోదీతో భేటీ
  • కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచాలని కోరనున్న సీఎం
  • ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నవించనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు  ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచాలని కోరనున్నారు.

అదే విధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను జాప్యం చేయకుండా విడుదల చేయాలని విన్నవించనున్నారు. రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకుంటారు. 

KCR
TRS
Narendra Modi
BJP
Delhi Tour
  • Loading...

More Telugu News