Rajinikanth: రజనీకాంత్ మాతో కలిస్తే తప్పేముంది?: బీజేపీ నేత ఎస్వీ శేఖర్

  • సంక్రాంతి తర్వాత రజనీకాంత్ పార్టీని ప్రారంభిస్తారంటూ ప్రచారం
  • తమతో కలసి రావాలని కోరుతున్న బీజేపీ నేతలు
  • ఇటీవల మోదీ, అమిత్ షాలను ఆకాశానికెత్తేసిన రజనీ

సంక్రాంతి పండుగ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, రజనీ తమతో కలసి రావాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన రజనీకాంత్... మోదీ, అమిత్ షాలను ఆకాశానికెత్తేశారు. దీంతో, బీజేపీకి రజనీ దగ్గరవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా తమిళ నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ మాట్లాడుతూ, తమిళనాడులో మోదీ వ్యతిరేకులంతా ఏకమయ్యారని... ఈ నేపథ్యంలో, భావసారూప్యత కలిగిన రజనీకాంత్ బీజేపీతో చేతులు కలిపితే తప్పేముందని ప్రశ్నించారు.

Rajinikanth
BJP
SV Sekhar
Kollywood
  • Loading...

More Telugu News