Crime News: అర్ధరాత్రి ఇంటిపై దాడి.. బంగారం, వెండి, నగదు దోపిడి!

  • శంషాబాద్‌ మండలం చౌదరిగుడా గ్రామంలో ఘటన
  • ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులకు బెదిరింపులు
  • మూడున్నర తులాల బంగారం, 45 తులాల వెండి అపహరణ

అర్ధరాత్రి కుటుంబ సభ్యులు ఆదమరిచి నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని చౌదరిగుడా గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

 గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌ అనే వ్యక్తి కుటుంబం నిద్రలో ఉండగా తలుపుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించారు. వారి వద్ద ఉన్న మూడున్నర తులాల బంగారం, నలభై ఐదు తులాల వెండి, లక్షా 25 వేల రూపాయల నగదు బలవంతంగా లాక్కుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Crime News
Ranga Reddy District
samshabad
dopidee
  • Loading...

More Telugu News