Huzur Nagar: హుజూర్ నగర్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తి

  • బరిలో నిలిచిన 31 మంది అభ్యర్థులు
  • వివిధ కారణాలతో 45 నామినేషన్ల తిరస్కరణ
  • తిరస్కరణకు గురైన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. హుజూర్ నగర్ బరిలో 31 మంది అభ్యర్థులు నిలిచారు. సంతకం, ఫారం-2 తప్పులు, డిపాజిట్లు చెల్లించకపోవడం వంటి కారణాలతో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. అటు, సీపీఎం అభ్యర్థి పోటీలో లేకపోవడంతో తమ మద్దతు టీఆర్ఎస్ కేనని సీపీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Huzur Nagar
Telangana
TRS
CPI
CPM
  • Loading...

More Telugu News