YS Viveka: వివేకాను చంపినవాళ్ల పేర్లను జగన్ దాచిపెడుతున్నారు: వర్ల రామయ్య

  • వివేకా హత్యోదంతంపై వర్ల వ్యాఖ్యలు
  • హంతకులెవరో జగన్ కు తెలుసన్న వర్ల
  • కడప ఎస్పీ బదిలీపై అనుమానాలున్నాయని వెల్లడి

ఎన్నికల ముందు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. తన బాబాయిని చంపింది ఎవరో జగన్ కు తెలుసని, కానీ ఆయన వాళ్ల పేర్లను దాచిపెడుతున్నారని ఆరోపించారు. కేసు విచారణ కీలకదశలో ఉన్న తరుణంలో కడప ఎస్పీని బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హంతకులు ఎవరన్నది ఎస్పీకి తెలుసని, అందుకే ఆయనను బదిలీపై పంపించి వేశారని తెలిపారు. ఎన్నికల ముందు విపక్షంలో ఉన్న జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

YS Viveka
Jagan
Varla Ramaiah
  • Loading...

More Telugu News