Andhra Pradesh: గుంటూరు, విజయనగరం, కర్నూలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

  • రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
  • హెచ్చరికలు జారీచేసిన అధికారులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన

రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. గుంటూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, బెల్లంకొండ మండలాలు, కర్నూలు జిల్లాలో రుద్రవరం, ఆళ్లగడ్డ, దోర్నిపాడు మండలాలు, విజయనగరం జిల్లాలో విజయనగరం, గజపతినగరం, గుర్ల, నెల్లిమర్ల, గంట్యాడ, పార్వతీపురం, మక్కున, సాలూరు, బొండపల్లి మండలాలకు పిడుగుపాటు హెచ్చరికలు చేశారు. ఈ మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Andhra Pradesh
Guntur District
Vijayanagaram District
Kurnool District
  • Loading...

More Telugu News