Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ విభజనను అడ్డుకోలేమన్న సుప్రీంకోర్టు
- ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీం విచారణ
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసేందుకు నిరాకరణ
- వివరణ ఇచ్చేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు
కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు కేంద్రానికి గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ... కేంద్రానికి నాలుగు వారాల గడువునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి.