Nara Lokesh: బడుగు, బలహీన వర్గాలకు బాలయోగి సేవలు చిరస్మరణీయం: నారా లోకేశ్

  • నేడు బాలయోగి జయంతి
  • అమలాపురం వెళ్లిన లోకేశ్
  • బాలయోగి జయంతి వేడుకల్లో పాల్గొనడంపై స్పందన

టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. కోనసీమలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బాలయోగి లోక్ సభ స్పీకర్ గా ఎదిగారని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని కీర్తించారు. బాలయోగి తనయుడు హరీశ్ మాధుర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ కోనసీమ ప్రజలకు అండగా నిలుస్తుండడం గర్వించదగిన విషయం అని వ్యాఖ్యానించారు. నేడు అమలాపురంలో స్వర్గీయ బాలయోగి జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలకడం మరువలేనని లోకేశ్ ట్వీట్ చేశారు.

Nara Lokesh
Balayogi
Telugudesam
  • Loading...

More Telugu News