R.Narayana Murthy: ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ చెప్పడం గొప్ప విషయం: ఆర్.నారాయణమూర్తి

  • కర్నూలు వచ్చిన ఆర్.నారాయణమూర్తి
  • 'మార్కెట్ లో ప్రజాస్వామ్యం' అంశంపై ప్రసంగం
  • జగన్ పై ప్రశంసలు

కర్నూలులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ ప్రముఖుడు ఆర్.నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. మార్కెట్ లో ప్రజాస్వామ్యం, డబ్బుకు బలి అవుతున్న రాజకీయం అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ సీఎం జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు.

పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో జగన్ వైఖరి అభినందనీయం అన్నారు. తమ పార్టీలోకి వచ్చేవాళ్లు తప్పనిసరిగా పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పడం నిజంగా గొప్ప విషయం అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్.నారాయణమూర్తి అన్నారు.

R.Narayana Murthy
Jagan
Andhra Pradesh
Kurnool District
  • Loading...

More Telugu News