India: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు పంత్ ను పక్కనబెట్టిన టీమిండియా
- ఫామ్ కోల్పోయిన పంత్
- పంత్ స్థానంలో సాహా పునరాగమనం
- రేపటి నుంచి విశాఖలో సఫారీలతో టెస్టు
ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో, రేపటి నుంచి విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టుకు పంత్ ను పక్కనబెట్టారు. పంత్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా టీమ్ ను ప్రకటించారు.
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలో దిగనున్నారు. తెలుగుతేజం హనుమవిహారి మరోసారి టీమ్ మేనేజ్ మెంట్ నమ్మకాన్ని చూరగొన్నాడు. విహారికి కూడా తుదిజట్టులో స్థానం కల్పించారు. విశాఖ ఏసీఏ స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో అశ్విన్, జడేజాలకు స్థానం కల్పించారు.
తొలి టెస్టుకు టీమిండియా ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.