Kodela: కోర్టులో లొంగిపోయిన కోడెల కుమారుడు శివరాం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b6c0cda974e93196827226e7408f1c749c4d13cc.jpg)
- కోడెల కుటుంబంపై పలు కేసులు నమోదు
- ముందస్తు బెయిల్ కోసం శివరాం పిటిషన్
- ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన కోర్టు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం ఈ రోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల కుటుంబంపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ, ముందస్తు బెయిల్ కోసం శివరాం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో... ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కాసేపట్లో ఆయన బెయిల్ ద్వారా బయటకు రానున్నారు.