Byreddy Siddharth Reddy: నందికొట్కూరులో వైసీపీ నేతల మధ్య ముదురుతున్న విభేదాలు.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై హత్యాయత్నం కేసు

  • హత్యాయత్నం కేసులో ఏ-13గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
  • తాను ఉండకూడదనే లక్ష్యంతో కొందరు పని చేస్తున్నారన్న బైరెడ్డి
  • ఆయనతో ఎలాంటి విభేదాలు లేవన్న ఎమ్మెల్యే ఆర్థర్

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. చిన్న స్థాయిలో మొదలైన విభేదాలు హత్యాయత్నాలు, కేసుల వరకు వెళ్లాయి. నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసులో బైరెడ్డిని ఏ-13గా నమోదు చేశారు.

మరోవైపు సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తనకు తెలియదని స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఆధిపత్యం కోసం గొడవలు జరుగుతున్నాయని, ఇవి పార్టీ గొడవలు కాదని చెప్పారు. ఇంకోవైపు సిద్ధార్థరెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతుండగా... ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆర్థర్ అంటున్నారు.

ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ, తాను ఉండకూడదనే లక్ష్యంతో కొందరు పనిచేస్తున్నారని అన్నారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన వారానికే తనపై పీడీ యాక్టు పెట్టడానికి సన్నాహకాలు చేసుకున్నారని చెప్పారు జగన్ ను నమ్ముకునే తాను ఉన్నానని... పదవులే కావాలనుకుంటే కేడీసీసీ, ఎమ్మెల్సీ పదవులను ఎప్పుడో స్వీకరించేవాడినని అన్నారు.

  • Loading...

More Telugu News