'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్ము రేపింది!
- ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 108 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
- విదేశాల్లో తెలుగు రైట్స్ ను కలుపుకుంటే రూ. 150 కోట్ల బిజినెస్
- కన్నడలో రూ. 27 కోట్ల బిజినెస్
మరోవైపు, 'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఒక్క తెలుగు వర్షన్ లోనే దాదాపు రూ. 150 కోట్ల బిజినెస్ జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 108 కోట్ల బిజినెస్ జరిగింది. విదేశాల్లో తెలుగు రైట్స్ తో కలుపుకుంటే ఇది రూ. 150 కోట్లకు చేరింది. మరోవైపు కన్నడలో కూడా ఈ చిత్రం చేసిన బిజినెస్ మామూలుగా లేదు. ఏకంగా రూ. 27 కోట్ల వరకు బిజినెస్ చేసింది. హిందీ వర్షన్ విషయంలో కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగింది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉండటంతో... బాలీవుడ్ లో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది.