Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కొత్త రెవెన్యూ చట్టంపైనే ఫోకస్!

  • ప్రగతి భవన్ లో ఈ సాయంత్రం కేబినెట్ సమావేశం
  • రెవెన్యూ బిల్లు ముసాయిదాకు ఆమోదముద్ర వేసే అవకాశం
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించే ఛాన్స్

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సాయంత్రం ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగబోతోంది. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ కార్మికుల సమ్మె, సచివాలయం కూల్చివేత వంటి అంశాలను ఈ భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ తరహాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమా? లేక కార్మికుల డిమాండ్లపై చర్చకు కమిటీ వేయడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telangana
Cabinet Meeting
KCR
TRS
  • Loading...

More Telugu News