Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షానికి నడిరోడ్డుపై కొట్టుకుపోయిన వ్యక్తి

  • హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తున్న వానలు
  • కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో గల్లంతు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. ఇక, పొంగిపొర్లుతున్న నాలాలు రోడ్లను కాలువల్లా మార్చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరద నీటిలో కొట్టుకుపోతున్న తన ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో అతడు కొట్టుకుపోయాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న విషయాలు తెలియరాలేదు. అందరూ చూస్తుండగానే అతడు నీటిలో కొట్టుకుపోయాడు.

Hyderabad
floods
krishna nagar
yousufguda
  • Loading...

More Telugu News